తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి ఎన్ని గంటలంటే?

కలం, వెబ్ డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు (Tirumala) వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం కావడంతో తిరుమల క్షేత్రంలో యాత్రికుల సందడి నెలకొంది. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం కాంప్లెక్స్ దాటి వెలుపలి వరకు భక్తులు సుదీర్ఘమైన క్యూలైన్లలో వేచి ఉన్నారు.

కాగా, టోకేన్‌ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వర్గాలు తెలిపాయి. సెలవు దినాలు కావడంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకోవడమే ఈ రద్దీకి కారణమని అంటున్నాయి. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విజిలెన్స్, శ్రీవారి సేవకులు నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు.

మరోవైపు తిరుమలలో నిన్న ఒకే రోజున మొత్తం 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 37,633 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>