గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో రాజకీయ పాటల హవా

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ పాటలు సందడి చేశాయి. యువత డీజే పాటలతో పాటు ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంబంధించిన పాటలపై ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. శోభాయాత్ర సాగిన ప్రధాన రహదారుల వెంట పెద్ద సంఖ్యలో భక్తులు, యువత తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. గణేష్ భక్తిగీతాలతో పాటు మోదీ, కేసీఆర్ పాటలు వినిపించడంతో యువత వాటికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. దీంతో నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>