కలం, సత్తుపల్లి: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి జరుగుతోందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ (MLA Matta Ragamayi) అన్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెం, నారాయణపురం గ్రామాల్లో లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకం వంటి పథకాల అమలుతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ దోమ ఆనంద్, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

