కరీంనగర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

కలం, కరీంనగర్ : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు చిరస్మరణీయమని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి (Chakali Ilamma Jayanti) సందర్భంగా కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ రోడ్డులోని ఆమె విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దొరల పాలన, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జీవితాన్ని, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోతకొండ శ్రీనివాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోతకొండ రాజయ్య, పూసల శ్రీకాంత్, బుత్కురి శివకృష్ణ, పూసాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>