కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నాగుపాము కలకలం రేపింది. చిన్న ఆంజనేయులు నివాసంలో శనివారం నాగుపాము సంచరిస్తుండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారాల రఘుకు సమాచారం అందించగా.. ఆయన స్నేక్ క్యాచర్ గుండెల శివకు విషయం తెలిపారు.
వెంటనే అక్కడికి చేరుకున్న శివ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని బంధించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు ఊపిరిపీల్చుకున్నారు. సకాలంలో స్పందించి పామును పట్టుకున్న శివను స్థానికులు అభినందించారు. విషసర్పాలు కనిపించినప్పుడు వాటిని చంపకుండా తనకు సమాచారం అందించాలని, సురక్షితంగా పట్టుకుని దూరప్రాంతంలో వదిలేస్తానని శివ తెలిపారు.

