‘సర్‌’ వివాదం.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు అందుకున్న వారు బూత్ లెవల్ ఆఫీసర్లను కలవాల్సిన అవసరం లేదని.. బీఎల్వోలే ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లను బీఎల్వోలే అప్లోడ్ చేస్తారని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంలో విబేధాలు తలెత్తాయనే వార్తల నేపథ్యంలో తొలిసారి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ఎన్నికల కమిషనర్లు సఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి కూడా హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియపై వారు సమీక్ష చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>