34 నియోజకవర్గాలకు జనసేన కో-ఆర్డినేటర్ల నియామకం

కలం, కరీంనగర్: రాబోయే ఖమ్మం వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాలకు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Polls) జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావును జనసేన పార్టీ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పది నియోజకవర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పన్నెండు నియోజకవర్గాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పన్నెండు నియోజకవర్గాలన్ని కలిపి మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున కో-ఆర్డినేటర్లను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ల పర్యవేక్షణలో నియమించడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

గెలుపు కోసం కృషి చేస్తాం

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ రావు గెలుపునకు కొత్తగా నియామకమైన కో-ఆర్డినేటర్లు కృషి చేయాలని, ఈ గెలుపుతో తెలంగాణలో జనసేన పార్టీ బోణీ కొట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పిలుపునివ్వడం జరిగిందని మహేందర్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీ (Janasena) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా క్షేత్రస్థాయి సమన్వయం, పట్టభద్రుల ఓటు నమోదు, పట్టభద్రుల అనుసంధానం, సంస్థాగత విస్తరణ, ఎన్నికల నిర్వహణ సమన్వయం, పార్టీ కార్యకలాపాలు వంటి అంశాలపై కో-ఆర్డినేటర్లు దృష్టి సారించాలని జనసేన పార్టీ నిర్దేశించడం జరిగిందని నూతనంగా పరకాల నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా నియామకమైన బేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>