కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) అని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta ) కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప యోధురాలని, ఆమె స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, డీఆర్ఓ ఎ.నిర్మల, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

