ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండ (Singarayakonda) జాతీయ రహదారి-16పై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం గోల్డెన్ కేఫ్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హరిప్రసాద్, నర్మదా దంపతులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమయంలో బాధితులు తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్నారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఘటన సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>