కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోని విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని (Manmohan Singh Statue) ఏర్పాటు చేశారు. ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం (సెప్టెంబర్ 26) ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
ఈ విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన వివిధ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మన్మోహన్ సింగ్ వహించిన కీలక పాత్రకు నిదర్శనంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది.

