కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ(Chintakuntawada) శ్రీ ఆంజనేయ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూకు వేలం పాటలో భారీ ధర పలికింది. పదకొండు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం లడ్డూ వేలం నిర్వహించారు. వేలం పాటలో భాగ్యనగర్ కాలనీకి చెందిన ముద్రకోల్ రాజా దంపతులు రూ.1.51 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో లడ్డూ వేలం పాటలో భారీ ధర పలకడంతో మండలి సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయ గణేష్ మండలి నిర్వాహకులు ముద్రకోల్ రాజా దంపతులను ఘనంగా సత్కరించారు.

