భద్రాచలంలో జోరుగా వినాయక నిమజ్జనాలు

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) రామయ్య సన్నిధి పవిత్ర గోదావరి నది తీరంలో గణనాథుల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపతులు గంగమ్మ తల్లి ఒడికి చేరేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తుండటంతో గోదావరి ఘాట్ వద్ద సందడి నెలకొంది. విగ్రహాలను నదిలో నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం భారీ క్రేన్లు, జేసీబీలతో పాటు లాంచీలు, మర బోట్లను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాల మోతల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుగుతోంది.

1,500 విగ్రహాల నిమజ్జనం పూర్తి..

భద్రాచలం వద్ద ఇప్పటికే దాదాపు 1,500 విగ్రహాల నిమజ్జనం పూర్తి కాగా, ఘాట్ సమీపంలో ఇంకా భారీగా విగ్రహాలు వరుసలో ఉన్నాయి. పొరుగునే ఉన్న ఏపీ నుంచి కూడా విగ్రహాలు తరలివస్తుండటంతో, నిమజ్జనం ప్రక్రియ మొత్తం ముగిసే సమయానికి రెండు వేలకు పైగా లంబోదరులు గోదావరిలో నిమజ్జనం పూర్తి చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటల పాటు ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చూడటానికి వివిధ శాఖల సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్ వద్ద దాదాపు 200 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>