మేలచెర్వు శివారులో విషాదం.. రైలు‌ ఢీకొన్ని వ్యక్తి మృతి

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal Accident) మండలం మేలచెర్వు గ్రామానికి చెందిన ఎం.రాజు (41) శుక్రవారం గ్రామ శివారులో గల రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని రైలు ఢికొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గద్వాల రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. ఎం.రాజు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లిన సమయంలో మేలచెర్వు వద్ద రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో‌ గుర్తు తెలియని రైలు ఢీకొట్టగా, సంఘటన స్థలంలో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>