కలెక్టర్‌ సమావేశంలో ప్రోటోకాల్‌ సీటింగ్‌పై చర్చ

కలం, సోన్: సోన్ మండలం న్యూ వెల్మల్ (New Velmal) గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియపై పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సంతోష్, ఎంపీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అయితే సమావేశంలో అధికారుల సీటింగ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాటు ఇంచార్జ్  అదనపు కలెక్టర్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్, సర్పంచ్ రాచకొండ సాగర్, పంచాయతీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి ముందు వరుసలో కూర్చున్నారు. కాగా తహసీల్దార్, ఎంపీఓ వెనుక వరుసలో కూర్చోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీఓలు వెనుక వరుసలో ఉండగా పంచాయతీ కార్యదర్శి ముందు వరుసలో కూర్చోవడంపై పలువురు రైతులు, గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ పర్యటనలు, అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్‌ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>