నా జీవిత లక్ష్యం అదొక్కటే: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన జీవిత ఏకైక లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు తాను అనేక బాధ్యతలను నిర్వర్తించానని.. వ్యక్తిగత కలలు ఏమీ లేవన్నారు. కేరళలోని నిలంబూరులో జ‌రిగిన ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును (Best Public Servant Award) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా స్వీకరించారు. నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ (Revanth Reddy) మాట్లాడుతూ.. ఈ అవార్డు తీసుకున్న తొలి కేరళ రాష్ట్రేతర వ్యక్తిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. కేరళ నుంచే రాజకీయ మార్పు గాలి మొదలైందని.. అది దేశమంతా వీచాలని ఆకాంక్షించారు. సంఘ్ పరివార్, గాంధీ పరివార్ మధ్య పోరాటం జరుగుతోందన్నారు. దేశాన్ని మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో సంఘ్ విభజిస్తోందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు కదిలి రావాలన్నారు.

పదవులు త్యాగం చేసిన కుటుంబం..

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం పదవులు, అధికారాన్ని త్యాగం చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రకరకాల చోరీలకు పాల్పడుతోందన్నారు. ఓటు చోరీ, పార్టీ చోరీ, గుర్తు చోరీ, నిధుల చోరీ పేరుతో దేశ భవిష్యత్తునే దెబ్బతీస్తోందన్నారు. సర్ ప్రక్రియ ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మత సామరస్యం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ శ్రేణులు గాంధీ కుటుంబానికి మద్దతుగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read : నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ గ్రాండ్ బోణీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>