కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (Deendayal Upadhyaya) 110వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చరిత్ర, సిద్ధాంతాలు, సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
బీజేపీలో పనిచేస్తున్న నాయకులు , కార్యకర్తలు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వెంకటేష్, సాత్విక్, హరీష్, నర్సారెడ్డి, సన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

