కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి (Baddipalli) గ్రామానికి చెందిన తాండ్ర రుద్ర (18) వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. మల్కాపూర్ క్రాస్‌రోడ్డు (Malkapur Road) సమీపంలోని కెనాల్లో గ్రామస్థులతో కలిసి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహంతో పాటు రుద్ర అనుకోకుండా నీటిలో పడిపోవడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుదీర్ఘంగా గాలించిన అనంతరం మానేరు డ్యాంలో రుద్ర మృతదేహాన్ని గుర్తించి నీటి నుంచి వెలికితీశారు.
ఘటన విషయం తెలుసుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. చిన్న వయస్సులో రుద్ర మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ఘటన అనంతర ప్రక్రియలను వేగవంతం చేసి మృతదేహాన్ని త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసు అధికారులను కోరినట్లు తెలిపారు. రుద్ర కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read: 60 శాతం మంది ఓటర్లకు నోటీసులు: సుదర్శన్ రెడ్డి
Follow Us On: X(Twitter)

