మహబూబ్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణకు శ్రీకారం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముడా నిధులు రూ.1.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌పై (Mini Tank Bund) చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ట్యాంక్ బండ్‌ను పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరేలా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వాకర్స్ కోసం ఆధునిక వాకింగ్ ట్రాక్, యువత కోసం ఓపెన్ జిమ్, ప్రత్యేక సెల్ఫీ పాయింట్, చిన్నారుల కోసం చిల్డ్రన్స్ ప్లే ఏరియాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా విశాలమైన బతుకమ్మ ఘాట్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామానుజులు రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు.. తీవ్ర ఉద్రిక్తత!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>