బధిరులను అవమానిస్తే చర్యలు : దీప కాసరగడ్డ

కలం, వనపర్తి: బధిరుల మనోభావాలు, హక్కులకు భంగం (Deaf Rights) కలిగించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ అన్నారు. అంతర్జాతీయ బధిరుల దినోత్సవం సందర్భంగా నాగవరం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా దీప కాసరగడ్డ మాట్లాడుతూ.. బధిరులను అవమానించేలా మాట్లాడటం, వారి వైకల్యాన్ని ఉద్దేశించి దూషించడం చట్ట ప్రకారం శిక్షార్హమని తెలిపారు. బధిరులకు ప్రభుత్వం కల్పించిన హక్కులు, సౌకర్యాలు అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈఎన్‌టీ వైద్య నిపుణుడు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించారు.

జ్ఞానేంద్రియాలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్‌ మారుతినందన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మధుమోహన్, వైద్యురాలు విద్యారాణి, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>