కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో (Nirmal SP Office) ప్రతిష్ఠించిన వినాయకుడి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గణనాథుడిని ప్రతిష్ఠించి సంప్రదాయ పద్ధతిలో నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన వేడుకల్లో భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించి శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

