కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi)కి ఈడీ సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో అవకతవకలపై నోటీసులు అందజేసింది. సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్ల నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణలపై విచారించేందుకు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులతో పేర్కొంది. అయితే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. రూ.173.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
Also Read: భారీ జనసందోహం.. వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
Follow Us On : WhatsApp

