కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో (Karimnagar) అర్ధరాత్రి వేళ ఓ కారు తీవ్ర బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఆదర్శనగర్ బోర్డు వద్ద విధుల్లో ఉన్న ‘3 టౌన్ బ్లూ కోల్ట్’ కానిస్టేబుళ్లను వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు(Blue Colt Constables) శివ, రత్నం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కానిస్టేబుల్‌కు కాలు విరగడంతో మెరుగైన వైద్యం
శివ అనే కానిస్టేబుల్ కాలు విరిగిపోవడంతో, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ రత్నం అనే కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు కావడంతో, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఇంటికి పంపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నగరం(Karimnagar)లోని సుభాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన హ్యుందాయ్ క్రెటా కారుగా పోలీసులు గుర్తించారు. కారు వివరాలు, నంబర్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read : హైదరాబాద్‌లో దారుణం .. స్నేహితుడిని కత్తులతో పొడిచి హత్య
Follow Us On : WhatsApp

