నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. రికార్డ్ క్రియేట్ చేసేనా!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో లడ్డూ వేలం అనగానే ఠక్కున గుర్తచ్చేది హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం. ఏటా నిర్వహించిన విధంగానే ఈ సారి కూడా బాలాపూర్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. చివరిరోజైన నేడు.. బాలాపూర్ నిమజ్జన కార్యక్రమం జరుగనుంది. అంతకుముందు స్వామి వారి లడ్డూ వేలం వేయనున్నారు. ఇందుకోసం గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

బాలాపూర్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు అటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఓఆర్ఆర్ వైపు మళ్లించారు. బాలాపూర్ నుంచి 16 కిలోమీటర్ల మేర సాగనున్న గణేశుడి శోభాయాత్ర సాగనుంది. బాలాపూర్, చాంద్రయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజేమార్కెట్‌, అబిడ్స్​ మీదుగా శోభాయాత్ర ట్యాంక్​బండ్ కు చేరుకుంటుంది.

బాలాపూర్ గణేశుడికి చివరి పూజ..

నవరాత్రుల పూజల్లో భాగంగా బాలాపూర్ గణపయ్య చివరి పూజ అందుకున్నాడు. శుక్రవారం ఉదయం 5 గంటలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి చివరి పూజ చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్‌లో గణేశుడి ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటలకు ఊరేగింపు పూర్తి కానుంది. మరికాసేపట్లోనే బొడ్రాయి కూడలిలో గణేశుడి లడ్డూ వేలం పాట ప్రక్రియ ప్రారంభమవుతుంది. బాలాపూర్ బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. లడ్డూ వేలం పాట తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఉంటుంది.

బొడ్రాయి కూడలిలో లడ్డూ వేలం పాట..

1994 నుంచి  మొదలైన బాలాపూర్‌  గణేశ్ లడ్డూ వేలంపాట.. ఏటా రికార్డ్ క్రియేట్ చేస్తూ వస్తుంది. తొలిసారిగా 1994లో రూ.450 తో బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. 2016లో రూ. 14. 65 లక్షలు, 2017లో రూ. 15.60 లక్షలు 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికింది. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను ఉత్సవ సమితి రద్దు చేసింది. 2021లో రూ. 18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. 2025 సంవత్సరంలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ధర రూ. 35 లక్షలు పలికింది. ఈ ఏడాది లడ్డూ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>