మామ చేతిలో అల్లుడు హతం.. కూతురును వేధిస్తున్నాడని దారుణం

కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని (Nirmal Crime) విశ్వనాథ్‌పేట్ కాలనీలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఎండీ సుమీర్ (23) అనే యువకుడు గత రెండేళ్లుగా ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై, తరచూ భార్య, అత్తా మామలను వేధిస్తున్నట్లు తెలిపారు. దీంతో విసిగిపోయిన మామ షేక్ నజీర్ గురువారం రాత్రి సుమీర్‌ పై పారతో దాడి చేసాడు.

తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సుమీర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు షేక్ నజీర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>