సారంగాపూర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వానికి చెరుకు రైతుల కీలక విజ్ఞప్తి

కలం, నిజామాబాద్ బ్యూరో : మూతపడిన సారంగపూర్ నిజాం చక్కెర ఫ్యాక్టరీ (Sarangapur Sugar Factory) తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని మోపాల్ లో చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం మోపాల్ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సారంగపూర్ నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, దుపల్లి లక్ష్మా రెడ్డి, తాడేం రాజారెడ్డి, పోచారం సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఒకనాడు మంచి లాభాలతో నడిచిన NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ వల్ల రైతులు అనేక లాభాలు గడించారని .. వారి పిల్లల చదువులకు, ఇండ్లు కట్టుకోవడం,పెళ్లిలు తదితర అనేక ఆర్థిక అభివృద్ధికి ఈ ఫ్యాక్టరీ తోడ్పడిందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర పాలసీలతో పాటు అవినీతి అధికారుల మూలంగా ఫ్యాక్టరీ నష్టాల్లో కురుకపోయిందని చెప్పారు. మూత పడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే ఉందని వారు అన్నారు. ఈ ప్రాంతంలో 80 గ్రామాలలో రైతులందరూ చెరుకు పండించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రైతుకు లాభసాటి ధర చెల్లిస్తామని, విత్తనము ఉచితంగా ఇస్తామని రైతులను ప్రోత్సహించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

ఆ రోజుల్లో బంగారం ధర 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,50,000 అయిందని తెలిపిన వారు.. అయినప్పటికీ అప్పుడు ఫ్యాక్టరికోసం రైతులు 100 రూపాయిల సభ్యత్వం చెల్లించరాని, పెద్ద మొత్తం రైతులు సభ్యత్వం ద్వారానే ఫ్యాక్టరీ ఏర్పాటయిందని వరన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ MLC బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు సుదర్శన్ రెడ్డి , రూరల్ MLA భూపతి రెడ్డి ఫ్యాక్టరీ విషయం లో సానుకూలంగా ఉన్నారని.. వారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎల్ నినో ప్రభావం ఉంది కావున ప్రభుత్వం అరుతడి పంటలవైపు వెళ్లాలని రైతులకు ప్రభుత్వం సూచిస్తుందని, ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు అరుతడిగా చెరుకు పంట వేసుకోవాలని అన్నారు. ఇప్పుడు బెల్లనికి మంచి డిమాండ్ ఉంది కావున సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరిని బెల్లం కేంద్రంగా మార్చి రూ. 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలొ కొట్టె గంగాధర్, మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి, అగ్గు చిన్నయ్య FPO చైర్మన్, గంగాధర్, K జనార్దన రెడ్డి, సాయినాథ్ రైతులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>