కలం, స్పోర్ట్స్: భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ (Sanju Samson) ను పక్కనపెట్టడంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో సంజూను తప్పించడం తన కోచింగ్ కెరీర్లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఆ రాత్రి తనకు అస్సలు నిద్రపట్టలేదని, ఈ విషయాన్ని నేరుగా సంజూతోనే చెప్పానని వెల్లడించారు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాడిని పక్కనపెట్టడం తేలిక కాదని గంభీర్ అన్నారు. అయితే ఆ సమయంలో యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జట్టు ప్రయోజనాలు, సిరీస్ గెలవడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ విషయంపై సంజూతో మాట్లాడగా.. అతడు సానుకూలంగా స్పందించాడని తెలిపారు. అయితే వైభవ్ వంటి యువ ఆటగాళ్లు అవకాశాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంభీర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఆధారంగా తుది జట్టును ఎంపిక చేయమని చెప్పారు. సుదీర్ఘకాలంగా రాణిస్తున్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మలకు భద్రత కల్పించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు.
ఇదే సమయంలో నాయకుడిగా శ్రేయస్ అయ్యర్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించారు. జట్టు కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేసే స్వార్థం లేని గుణం శ్రేయస్‌కు ఉందన్నారు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లు బలహీనులు కాబోరని గంభీర్ పేర్కొన్నారు.

