పారడైజ్‌లో కేసీఆర్ సీన్స్‌.. ద‌ద్ద‌రిల్లిన థియేట‌ర్లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ ది ప్యార‌డైజ్ (The Paradise) గురువారం విడుదలై థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. తెలంగాణ జాన‌ప‌ద పాట‌లు, యాస‌తో ముందు నుంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఆడియెన్స్‌కు డైరెక్ట‌ర్ చాలా స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడు. వీటిలో కేసీఆర్ (KCR) క్యారెక్ట‌ర్ కు థియేట‌ర్ల‌లో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. 1980ల్లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కల్పిత కథతో ‘ప్యారడైజ్’ సినిమా తెరకెక్కింది. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలబడే ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో టాలీవుడ్ నటుడు ప్రియదర్శి నటించారు.

అయితే, ప్రియ‌ద‌ర్శి పోషించిన శంక‌ర‌న్న‌ పాత్రలో ఆయన బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాస, డైలాగ్ డెలివరీ చూస్తున్నంతసేపు కేసీఆరే గుర్తొస్తారు. కేసీఆర్ స్ఫూర్తితో డైరెక్ట‌ర్‌ క్రియేట్ చేసిన ఈ క్యారెక్ట‌ర్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రియ‌ద‌ర్శి కూడా కేసీఆర్‌ను దింపేసాడ‌ని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. సినిమాలో ఈ శంకరన్న పాత్ర వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన వీడియో క్లిప్స్, ఫొటోలు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>