కలం, తానూరు: తానూరు (Tanur) మండలం బోసి గ్రామంలోని ప్రసిద్ధ కర్ర వినాయకుడిని (Karra Vinayaka Temple) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు పూజారులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయంలోని గణేశుడు, శివుడికి కలెక్టర్ పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని పండుగలను ప్రజలు కలిసిమెలిసి, సోదరభావంతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, పూజారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : మరో భారీ ఉద్యమానికి సీజేపీ ప్లాన్.. ఈ సారి టార్గెట్ ఎవరంటే..!
Follow Us On : WhatsApp

