రెండు రోజులు వైన్ షాపులు బంద్ .. సీపీ కీలక ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైన్ షాపులు (Wine Shops), కల్లు దుకాణాలు , కల్లు డిపోలు , ఐ.ఎమ్.ఎల్ షాప్స్ / 2-బి బార్స్ / క్లబ్బులు / టిడి-1 టి.యస్.బి.సి.ఎల్ లను 25 న సాయంత్రం 6 గంటల నుండి 27 ఉదయం 6 గంటల వరకు బంద్ చేయనున్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలు భక్తులు మండళ్ల నిర్వాహకులు సహకరించాలని సిపి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>