సోన్ మండల అభివృద్ధిపై సమీక్ష.. అధికారులకు ఎమ్మెల్యే ఏలేటి కీలక ఆదేశాలు

కలం, సోన్: నిర్మల్ జిలా సోన్ (Soan) మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

పెండింగ్‌ లో ఉన్న పనులను వేగవంతం చేసి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రామకృష్ణ, తహశీల్దార్ సంతోష్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>