కలం, నిర్మల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ, సమర్పణను పురస్కరించుకుని ‘25 సంవత్సరాల సేవ, సమర్పణ, అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే అంశంపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫినగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Nirmal KGBV) లో గురువారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కార్యక్రమానికి హాజరై విద్యార్థుల చిత్రాలను పరిశీలించారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశ అభివృద్ధి, విద్య, సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, యువత పాత్ర, సామాజిక బాధ్యత తదితర అంశాలను తమ చిత్రాల్లో ప్రతిబింబించారు. విద్యార్థుల సృజనాత్మకతను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల అవగాహన, సామాజిక బాధ్యత, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం అవసరమన్నారు. చిత్రలేఖన పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులను సైతం అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

