సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణలో ఉపఎన్నిక ఖాయం

కలం, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టు సంచలన తీర్పుతో తెలంగాణలో ఉపఎన్నిక ఖాయం అయింది. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దానం నాగేందర్ అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే సీజే బెంచ్ డిస్మిస్ చేసింది. ఖైరతాబాద్ స్థానానికి ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Khairatabad Bypoll) అనివార్యమైంది.

బీఆర్ఎస్, బీజేపీ ఫిర్యాదుతో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ (Danam Nagender) పోటీ చేసి గెలిచారు. రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచే  సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అధికారులతో సంప్రదింపు అనంతరం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని వారిపై వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

సుదీర్ఘ వాదనలు, పలుసార్లు కేసు విచారణ వాయిదాల అనంతరం దానం నాగేందర్‌పై అనర్హత వేటు విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపై దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. దానం నాగేందర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు కావడంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక ఏర్పడింది.

ఈసీ షెడ్యూల్ పైనే దృష్టి..

ఉపఎన్నిక నిర్వహణ స్పష్టం కావడంతో రాష్ట్ర ఎన్నికల అధికారులపై ప్రజానీకం దృష్టి సారించింది. ఈసీ అధికారులు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో బీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీపై దృష్టి మరల్చింది.

బీఆర్ఎస్ పోరాటంతోనే..

దానం నాగేందర్ అనర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని.. పార్టీ శ్రేణుల నిర్విరామ పోరాటం కారణంగానే తాము గెలిచామని బీఆర్ఎస్ చెబుతోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడానికి ఇది తొలిమెట్టు అని పేర్కొంటుంది. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పడానికి ఇదొక నిదర్శం అని గులాబీ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రభంజనం సృష్టిస్తాం..

అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం.. దానం నాగేందర్ పిటిషన్ డిస్మిస్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ సైతం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. దానం నాగేందర్‌పై ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు తమ కృషి ఫలితంగానే అని బీజేపీ చెప్పుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తమ విజయానికి నాంది అని అభిప్రాయపడుతోంది. ఖైరతాబాద్ బైపోల్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టిస్తామని రాష్ట్ర బీజేపీ ధృడమైన విశ్వసంతో ఉంది.

మరోసారి సత్తా చాటుతాం..

అటు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం.. ఈ స్థానాన్ని గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతుంది. ఈ బైపోల్‌లో గెలిచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎరగవేయాలని భావిస్తోంది. దానం నాగేందర్ అంశంపై నిశితంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్.. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోనుంది.

మళ్ళీ పోరాడుతానంటున్న దానం..

అటు దానం నాగేందర్ సైతం ఉప ఎన్నిక పోటీపై వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఇటీవల తనపై హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ స్థానం నుంచే మళ్ళీ గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.  న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లు.. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. యుద్ధం తనకేం కొత్త కాదని.. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా అని చెప్పుకొచ్చారు.

గెలిచేదెవరో..

సుప్రీం కోర్టు తీర్పుతో ఖైరతాబాద్ బైపోల్ (Khairatabad Bypoll) ఏర్పడటంతో పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అన్ని పార్టీలు.. గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ బైపోల్ కీలకంగా మారడంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. దానం నాగేందర్ మళ్ళీ గెలుస్తారా? లేదా కొత్త పార్టీని ప్రజలు గెలిపిస్తారా? అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతుంది.

Also Read : తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>