శక్తి స్కీం, జీవో నం.97ను రద్దు చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో నం.97ను వెంటనే రద్దు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Maheshwar Reddy) మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల సాంకేతిక విద్యా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తూ, విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. శక్తి స్కీం, జీవో నం. 97పై ప్రభుత్వం వెంటనే పునరాలోచించి విద్యార్థుల ఆందోళనకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విద్యార్థుల ఆందోళనకు తమ మద్దతు కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

Also Read : దానం నాగేందర్ కు సుప్రీం కోర్టు షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>