కరీంనగర్‌‌లో గంగా-జమునా తెహజీబ్.. అహ్మద్ హుస్సేన్ సేవలకు ప్రశంసలు!

కలం, ​కరీంనగర్: మానవత్వమే అభిమతంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కరీంనగర్ (Karimnagar) వేదికగా ‘హిందూ-ముస్లిం భాయి భాయి’ అనే నినాదాన్ని నిలబెడుతున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. గంగా జమునా తెహజీబ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కరీంనగర్‌లో జామ్ జామ్ వెల్ఫేర్ సొసైటీ (zam zam Welfare Society) ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన సొంత ఖర్చులతో అందిస్తున్న సేవలు అభినందనీయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

​బుధవారం గణేష్ నిమజ్జనం (Ganesh Immersion) సందర్భంగా నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద శోభాయాత్రలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాటు చేసిన బాదం మిల్క్, మినరల్ వాటర్, లస్సీ, రూ అబ్జా, గులాబ్ వాటర్ స్టాల్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మానవత్వపు పునాదిగా ఇటువంటి అద్భుతమైన సేవలు అందిస్తూ గులాం అహ్మద్ హుస్సేన్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్డీవో షర్మిల, ఏసీపీలు, సీఐలు, హిందూ ఉత్సవ సమితి చైర్మన్ కుందారపు మహేశ్వర్, నాయకులు వూట్కూరి రాధాకృష్ణ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>