వర్ష బీభత్సానికి కూలిన రాజుపేట బ్రిడ్జి..!

​కలం, దమ్మ పేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న తుఫాన్ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల దాటికి ములకలపల్లి – అశ్వరావుపేట ప్రధాన రహదారిపై ఉన్న రాజుపేట వాగు బ్రిడ్జి (Rajupeta Bridge) నీటి ఉధృతికి తాళలేక పూర్తిగా కూలిపోయింది. బ్రిడ్జి నేలమట్టం కావడంతో ఈ ఇరు మండలాల మధ్య రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.​రహదారి బంధం తెగిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వంతెన ధ్వంసమైన ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ఎవరూ అటువైపు వెళ్లవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ​మరోవైపు కూలిపోయిన వంతెన వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వెంటనే అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>