క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే యువ‌కుడి మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాజ‌స్థాన్ (Rajasthan) రాష్ట్రంలో విషాదరకర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దౌసా జిల్లాలో గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూనే ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. సంలేటి గ్రామానికి చెందిన రాంరాజ్ మీనా (25) అనే యువ‌కుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి క్రికెట్ ఆడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో బౌలింగ్ వేస్తున్న స‌మ‌యంలో రాంరాజ్‌కు ఛాతీలో నొప్పి వ‌చ్చింది. గ్రౌండ్‌లో కొద్దిసేపు ఇబ్బంది ప‌డ్డాడు. కొన్ని క్ష‌ణాల్లోనే ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు.

రాంరాజ్ స‌హ‌చ‌రులు వెంట‌నే అత‌డి ద‌గ్గ‌రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. అనంత‌రం అత‌డిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే యువ‌కుడు అప్ప‌టికే మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. రాంరాజ్‌కు ఐదు నెల‌ల క్రిత‌మే వివాహం అయ్యింది. రాంరాజ్‌ మృతితో అత‌డి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మ‌రోవైపు రాంరాజ్ గ్రౌండ్‌లో కుప్ప‌కూలిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>