ఉద్యోగుల సంక్షేమంపై రాజేష్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు

కలం, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వారి సమస్యల త్వరిత పరిష్కారమే టీఎన్‌జీవోస్ సంఘం ప్రధాన లక్ష్యమని కరీంనగర్ (Karimnagar) పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ (Rajesh Bharadwaj) తెలిపారు. ఉద్యోగుల పక్షాన నిలబడి నిరంతరం పోరాడటమే తమ ధ్యేయమన్నారు. బుధవారం టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంతో పాటు రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) కార్యాలయంలో రాజేష్ భరద్వాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాజేష్ భరద్వాజ్ మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పదోన్నతులు, బదిలీల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా కార్యాలయాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. టీఎన్‌జీవోస్, టీజీవోస్ సంఘాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఉద్యోగుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని, హక్కుల సాధనలో రాజీపడకుండా ముందుకు సాగుతామని రాజేష్ భరద్వాజ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవోస్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాలీచరణ్ గౌడ్, కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>