కలం, స్పోర్ట్స్: డీపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ (DPL Match-Fixing) వివాదంపై క్రికెటర్ వంశ్ బేడీ (Vansh Bedi) తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ఇవన్నీ తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనకు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. స్ట్రింగ్ ఆపరేషన్‌లో రచిత్ భాటియా పేర్కొన్న వ్యక్తి తాను కాదని వంశ్ బేడీ స్పష్టం చేశారు. సీఎస్‌కే ఆటగాడికి సంబంధించిన వార్తలతో తనను ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై తన లీగల్ టీమ్ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆయన (Vansh Bedi) విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంపై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కూడా స్పందించింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటిని ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదని స్పష్టం చేసింది. ఆధారాలు లేని వార్తల ఆధారంగా ఎలాంటి ముగింపునకు రావడం తగదని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపించినట్లు డీడీసీఏ తెలిపింది.
Also Read : ‘ది ప్యారడైజ్’ రిలీజ్.. నాని భార్య ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: Instagram

