కలం, దిలావర్పూర్: దిలావర్పూర్ (Dilawarpur) మండలం కదిలి గ్రామంలోని శ్రీమాత అన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర ఆలయ (Kadili Temple) హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఎల్వత్ దత్తాత్రేయ మందిరం ఈఓ రమణరావు పర్యవేక్షణలో అన్ని హుండీలను లెక్కించగా మొత్తం రూ. 5,80,569 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రాజేష్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నార్వాడే వెంకట్రావు పటేల్, గ్రామ సర్పంచ్ జాదవ్ మారుతి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ మాధవరావు, ధర్మకర్తలు, పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

