తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్‌ వినియోగం, రవాణా చేసేవారిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Telangana Eagle Force), యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అవార్డును అందుకోవడంపై ప్రశంసించారు. ఈగల్ ఫోర్స్ నిబద్ధతకు ఈ అవార్డే నిదర్శనమని.. రాష్ట్రాన్ని, యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించేందుకు మరింత బాగా పనిచేయాలని సూచించారు.

డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 7 ప్రమాణాలను 80 శాతం వరకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పక్కా నిఘా సమాచారంతో తెలంగాణలో కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నామని వివరించారు. ఈగల్ ఫోర్స్ (Telangana Eagle Force) సిబ్బందికి డీజీపీ సీవీ ఆనంద్ కూడా అభినందనలు తెలిపారు.

Also Read : భారీ వ‌ర్షం.. పెచ్చులు ఊడిన చార్మినార్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>