తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation)  సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు జరిగిన సమావేశానికి 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. వీరిలో 214 మంది రఘు మాస్టర్‌ అధ్యక్షుడు కావాలని కోరడంతో ఈ మేరకు ప్రస్తుత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది.

అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. దీంతో కొన్ని నెలలుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలకు తెరదించినట్లయింది. ఫిల్మ్ ఫెడరేషన్ తాజా నిర్ణయంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తన పదవిని కోల్పోయినట్లయింది. రఘు మాస్టర్‌కు టాప్ కొరియోగ్రాఫర్ల మద్దతు పూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది.

అసలేం జరిగిందంటే..

డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు సభ్యులు రాజీనామా బాట పట్టారు. ఈ క్రమంలో రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి చట్టబద్ధత లేదని వాదించిన సుమలత.. ఏకంగా కోర్టుకు వెళ్లారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. చివరికీ చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర హీరోలు స్పందించినా గొడవ సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో డ్యాన్సర్ల మద్దతు ఎవరికీ ఉందనే అంశంపై బల నిరూపణ పెట్టగా.. రఘు మాస్టర్‌కే ఎక్కువ మంది ఓటేశారు. దీంతో సుమలత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి.. నూతన ఎన్నికలకు ఫిల్మ్ ఫెడరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>