రాష్ట్రాల‌కు నూత‌న ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ

క‌లం, వెబ్‌డెస్క్‌: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు నూతన ఇన్‌చార్జ్‌లు (New Incharges), సహ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ బుధ‌వారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

పలు కీలక రాష్ట్రాలకు అగ్రనేతలకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌గా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. సహ ఇన్‌చార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ వ్యవహరించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌గా డాక్టర్ అరవింద్ భదోరియాను నియమించారు. సహ ఇన్‌చార్జ్‌గా వనతి శ్రీనివాసన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ బాధ్యతలను సునీల్ బన్సల్‌కే అప్పగించారు.

వీటితో పాటు మరికొన్ని ప్రముఖ రాష్ట్రాల బాధ్యతలను కూడా కేటాయించారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా రామ్ మాధవ్ నియామక‌మ‌య్యారు. ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా వినోద్ తావ్డే బాధ్యతలు చేపట్టనున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ బ‌లోపేతం, రాబోయే కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఈ కొత్త ఇన్‌చార్జ్‌లు (BJP New Incharges), సహ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

Also Read : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>