కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఏసీ పేలడంతో మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. చిన్నారుల విభాగం మంటలతోపాటు పొగతో నిండిపోవడంతో చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురై చనిపోయారు.
ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
ప్రమాదం జరిగిన సమయంలో 5 రోజుల శిశువు మృతి చెందగా.. మంగళవారం చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. బుధవారం ఉదయం మరో ఇద్దరు శిశువులు చనిపోవడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చిన్నారి శిశువుల మృతితో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
రూ.25 లక్షలు ఇవ్వాలి..
చికిత్స పొందుతున్న శిశువులను చూసేందుకు ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రికి బీఆర్ఎస్ నాయకుల బృందం కదిలొచ్చింది. బాధాతప్త హృదయాలతో చిన్నారులను, బాధితులను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బుక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. బాధ పడొద్దని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం వెంటనే చెల్లించి మృతుల కుటుంబాలకు న్యాయం చేకూర్చాలన్నారు.
Also Read : ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం
Follow Us On: X(Twitter)

