కలం వెబ్ డెస్క్ : భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రి బాయి పూలే(Savitribai Phule) 195వ జయంతికి ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం'(Women Teachers Day)గా ప్రకటిస్తూ అసెంబ్లీలో జీవో విడుదల చేసింది. మహిళా విద్య కోసం సావిత్రి బాయి పూలే చేసిన అపూర్వ సేవలకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జనవరి 3న శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Women Teachers Day) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించనున్నారు. సావిత్రి బాయి స్త్రీ విద్యకు ఆంక్షలు విధించిన సామాజిక విశ్వాసాలను ధిక్కరించి, భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆమె భర్త జ్యోతీరావు పూలేతో కలిసి మహిళా విద్య కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా రంగంలో పని చేస్తున్న మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖతమే: కవిత
Follow Us On: Pinterest


