నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నాంపల్లి లో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక మనోరంజన్ కోర్టుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. 2022 జనవరి 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిఆర్ బస్తీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రెస్ మీట్ నిర్వహించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.

అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్కతో పాటు మరో ఆరుగురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది.  ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>