నంది పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక నంది చలనచిత్ర, టీవీ పురస్కారాలకు అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఉత్తమ తెలుగు సినిమాలు, టీవీ చిత్రాలు, టెలిఫిల్మ్స్, ధారావాహికలు (సీరియల్స్), డాక్యుమెంటరీలు, బాలల చిత్రాలలో ప్రతిభ చూపిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థల నుండి ఈ అవార్డుల (Nandi Awards) కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు 2026 అక్టోబర్ 12 చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత ధృవీకరణ పత్రాల ప్రింట్ కాపీలను 2026 అక్టోబర్ 16వ తేదీ నాటికి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ పురస్కారాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు, దరఖాస్తు విధానం, ఇతర సమాచారం కోసం అభ్యర్థులు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ అధికారిక వెబ్‌సైట్ http://apsftvtdc.in ను సందర్శించవచ్చని అధికారులు వెల్లడించారు.

Also Read : హీరో నాని ట్వీట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>