డ్ర‌గ్స్‌పై యుద్ధం.. డెడ్‌లైన్ ప్ర‌క‌టించిన అమిత్‌షా!

క‌లం, వెబ్‌డెస్క్‌: భార‌త్‌లోకి ఒక్క గ్రామ్ డ్ర‌గ్స్ కూడా రాకూడ‌ద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఢిల్లీలో మంగ‌ళ‌వారం జరిగిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల మూడో జాతీయ సదస్సులో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా దేశంలో డ్రగ్స్ నివారణకు డెడ్ లైన్ ప్రకటించారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశం నుంచి డ్ర‌గ్స్‌ వ్యాపారాన్ని పూర్తిగా రూపుమాపాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత‌ ప్రాంతాల పోలీస్ అధికారుల‌తో మాట్లాడుతూ.. భారత్‌లోకి ఒక్క గ్రామ్‌ డ్రగ్స్ కూడా రాకుండా, అలాగే ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం సమావేశాలు, నివేదికలు, సీజ్ చేసిన లెక్కలతో సరిపెట్టుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్‌లను పూర్తిగా కూల్చివేయాలని, కేసులను విజయవంతంగా దర్యాప్తు చేసి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ‘విజన్ డాక్యుమెంట్ 2026-2029’ పేరుతో పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణాలో క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్ వంటి అధునాతన మార్గాలను వాడుతున్న నేపథ్యంలో, సాంకేతికంగా బలపడి సరికొత్త వ్యూహాలతో పోరాడాలని పోలీసులను అమిత్ షా కోరారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ఆర్థిక మూలాలను, హవాలా లావాదేవీలను ఛేదించాలని ఆదేశించారు. యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, విదేశీ డ్రగ్ స్మగ్లర్లను వెనక్కి రప్పించి చట్టపరంగా శిక్షించడంతో పాటు, దేశంలో పట్టుబడిన విదేశీయులను వెంటనే డిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>