‘దోపిడీ’పై నిఘా.. మీ సేవ కేంద్రాల్లో తనిఖీలు

​కలం, ఖమ్మం బ్యూరో : మీ సేవ (Mee Seva Centers), ఆధార్ కేంద్రాల ద్వారా జరుగుతున్న అదనపు రుసుముల వసూళ్లు, దోపిడీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం కోరాడ ఝళిపించింది. నిర్ణీత ధరల కంటే అదనంగా ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా సదరు కేంద్రాల లైసెన్సులు రద్దు చేస్తామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు హెచ్చరించారు.

మంగళవారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు మీ సేవ, ఆధార్ కేంద్రాలను టీజీ టీఎస్ జిల్లా మేనేజర్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల నిర్వహణ తీరు, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, నిర్ణీత వేళల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

​అనంతరం ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మాట్లాడుతూ మీ సేవ కేంద్రాలకు (Mee Seva Centers) వచ్చే ప్రజల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రుసుములకు మించి అదనపు చార్జీలు వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సేవల్లో పారదర్శకత, వేగవంతమైన పనితీరు ప్రామాణికంగా ఉండాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేంద్రాల అనుమతులను వెంటనే రద్దు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. సేవలు పొందేందుకు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నిర్ణీత పనివేళలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆదేశించారు.

Also Read : కేటీఆర్‌కు ప్రాజెక్టుల గురించి తెలియదు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>