వివాదాస్ప‌దంగా రామగుండం కార్పొరేషన్ ‘ఎజెండా’

కలం, రామగుండం: రామగుండం నగర పాలక సంస్థ (Ramagundam Corporation) రెండవ కౌన్సిల్ ఎజెండా వివాదాస్పదంగా మారింది. గత ఆరు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాలకవర్గం, ఎట్టకేలకు ఈ నెల 25న సమావేశం ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు 26 అంశాలతో ప్రతిపాదించిన ఎజెండాను రూపొందించింది. అయితే ఈ ఎజెండా ప్రజోపయోగంగా లేదని, కేవలం స్వలాభం కోసమే తయారైందని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

రూ.10 లక్షల పనులకు రూ.4 కోట్ల బిల్లు?

ఎజెండాలోని 26వ అంశంపై సభ్యుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2024 వేసవి కార్యాచరణలో భాగంగా ఏఎండీ పథకం కింద ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేసినప్పటికీ, పనులు ఆలస్యమవ్వడంతో ఆ నిధులను రద్దు చేసింది. సదరు పనుల బిల్లుల చెల్లింపు సాధ్యం కాదని సీడీఎంఏ తేల్చిచెప్పినప్పటికీ కాంట్రాక్టింగ్ ఏజెన్సీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల పేరుతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఆ సొమ్ము చెల్లించేందుకు అధికారులు ప్రతిపాదించారు. అయితే లీకేజీలు, అంతర్గత కుళాయిల కనెక్షన్ల కొరకు రూ.10 లక్షల అంచనా వేయగా ప్రతిపాదనల్లో మాత్రం రూ. 4,03,19,191 చెల్లించాలని పేర్కొనడం గమనార్హం.

కేవలం ప్రింటింగ్ పొరపాటా? లేక అధికారుల అంకెల గారడీనా? అని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. రూ.10 లక్షల అంచనాకు రూ.40 లక్షలా లేదా రూ.4 కోట్లా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. ఆరు నెలల విరామం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో అధికారుల జవాబుదారీతనంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి కౌన్సిల్ భేటీలో అధికార పక్షం ఇచ్చే సమాధానంపైనే అందరి దృష్టి నెలకొంది.

Also Read : నేను వచ్చాకే అమెరికాకు స్వర్ణ యుగం: ట్రంప్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>