కలం, నిర్మల్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో పసికందులు మృతి చెందడంపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణాధారంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.
అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలు, ఆస్పత్రిలోని భద్రతా ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన పసికందుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : భద్రాద్రి నియోజకవర్గాల్లో ముక్కలవుతున్న గులాబీ దళం!
Follow Us On: X(Twitter)

